• 14 minutes ago
Rush Devotees At Konaseema Tirumala : కోనసీమ జిల్లా అత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం దీనిని 'కోనసీమ తిరుమల' అని పిలుస్తారు. ఈ ఆలయం ప్రస్తుతం 'గోవింద' నామస్మరణతో మార్మోగిపోయింది. ఈ ఆలయంలో ఏడు శనివారాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేక వ్రతం (నోములు నోచుకునే భక్తులు) కూడా జరుగుతోంది.  దీన్ని ఆచరించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. వేద పండితులు స్వామివారికి సుప్రభాత సేవ, మంత్రపుష్పం, లక్ష్మీ హోమం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి, స్వామివారి ఆశీస్సులను పొందుతున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. ప్రస్తుతం గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Category

🗞
News
Transcript
00:00Thank you very much.

Recommended