• 8 minutes ago
Tension During 2nd Phase Panchayat Elections: అనంతపురం జిల్లా యల్లనూరులో రెండో విడత పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ వద్ద టీడీపీ అభ్యర్థి ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో వైఎస్సార్​సీపీకి చెందిన సుమారు 100 మంది వ్యక్తులు ఆరుగురు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.ఉదయం 6 గంటల సమయంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి దొడ్లో సుహాసిని పోలింగ్ ఏజెంట్లను సరిచేసుకుంటున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు బాధితులు ఆరోపించారు. దాడిలో గాయపడిన ఆరుగురిని వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ఈ ఘటనపై టీడీపీ సర్పంచ్ అభ్యర్థి దొడ్లో సుహాసిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Category

🗞
News
Transcript
00:00What

Recommended