Skip to playerSkip to main content
  • 9 years ago
Prabhas-starrer Saaho’s first look poster, which was unveiled on his birthday, looks impressive, many find it quite similar to a poster of Ryan Gosling’s Blade Runner 2049. Here are many more such examples.
సినిమా రంగంలో ఇతర భాషల నుంచి స్ఫూర్తి పొంది సినిమాలు తీయడం గానీ, పోస్టర్లు కాపీ కొట్టడం గానీ సర్వసాధారణమే.ఏదైనా పక్క సినిమా నుంచి లేపేస్తే వెంటనే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతున్నది.సాహో పోస్టర్ ఓ హాలీవుడ్ చిత్రం నుంచి తీసుకొన్నారనే ఆరోపణల నేపథ్యంలో.. అలాంటి కాపీ వీరుల పోస్టర్ కహానీలు మీ కోసం..
సాహో చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఆ పోస్టర్ ఇటీవల విడుదలైన బ్లేడ్ రన్నర్ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్ లుక్‌ను పోలీ ఉండటంతో ప్రేక్షకులు వెంటనే పట్టేశారు. ఫస్ట్ లుక్ విడుదలైన కొద్ది సేపటికే ఇది కాపీ అంటూ రచ్చ రచ్చ చేశారు. సాహో పోస్టర్ మాదిరిగానే ఇటీవల కాలంలో ఈ కాపీ బాగోతం బాగానే నడిపిస్తుందనడానికి ఆధారంగా నిలిచే పోస్టర్లు మీ కోసం..
జైలు జీవితం తర్వాత సంజయ్ దత్ కమ్ బ్యాక్ మూవీ భూమి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ది గ్రే అనే చిత్రం కాపీ కొట్టినట్టు స్పష్టమైంది.
రెండు మూడు ఏళ్ల క్రితం షారుక్ ఖాన్ నటించిన రా.వన్ చిత్రంలోని ఓ స్టిల్‌ను బ్యాట్‌మ్యాన్ బిగిన్స్ నుంచి కాపీ కొట్టినట్టు అర్థమవుతున్నది.

Recommended