Ravi Teja backed out of doing the remake of Tamil film Bogan following his success with Raja The Great and director Lakshman is upset. Talking to a leading online entertainment portal, Lakshman said: “I had to rework the script for the Telugu audience.
'రాజా ది గ్రేట్'...రూపంలో చాలా కాలం తర్వాత రవితేజ ఖాతాలో హిట్ పడింది. అంతకు ముందు వరుస ప్లాపులు ఎదుర్కొన్న మాస్ మహారాజ ఈ విజయంతో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. రొటీన్‌గా ఉండే సినిమాలు కాకుండా... కొత్తగా, డిఫరెంటుగా ఉండే సబ్జెక్టులు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నారు. తన కొత్త నిర్ణయం తర్వాత గతంలో కమిటైన కొన్ని సినిమాలను కూడా రవితేజ పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా 'బోగన్' అనే తమిళ రీమేక్ చిత్రాన్ని చేయను అని తెగేసి చెప్పారట.
‘రాజా ది గ్రేట్' సినిమా కంటే ముందే ‘బోగన్' తెలుగు రీమేక్‌కు రవితేజ ఓకే చెప్పారు. ఈ చిత్రంలో రవితేజను హీరోగా, కేథరీన్ను హీరోయిన్గా అనుకున్నారు. తమిళ నటుడు ఎస్జే సూర్యతో విలన్ రోల్ చేయించాలనుకున్నారు.
జయం రవి, అరవింద్ స్వామిలు నటించిన 'బోగన్' చిత్రానికి తమిళంలో లక్ష్మణ్ దర్శకత్వం వహించారు. ఈ కథను రవితేజకు వినిపించడంతో ఆయనకు నచ్చి ఒకే చెప్పాడు. తాను ఎంతో కష్టపడి రవితేజ ఇమేజ్‌కు తగిన విధంగా స్క్రిప్టులో మార్పులు చేసిన తర్వాత చేయను అని చెప్పడంతో దర్శకుడు లక్ష్మణ్ బోరుమంటున్నాడు.