Yet another trailer from Manchu Manoj's upcoming film 'Okkadu Migiladu' was released on November 1st. The trailer is loaded with intense and emotional dialogues and showcases the existential turmoil of the Sri Lankan civil war refugees in India.
శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ ప్రభాకరణ్ జీవిత కథ ఆధారంగ తెరకెక్కుతున్న ఒక్కడు మిగిలాడు మంచు మనోజ్ కథానాయకుడిగా అజయ్ ఆండ్ర్యూస్ 'ఒక్కడు మిగిలాడు' సినిమాను తెరకెక్కించాడు. "దేశం వర్థిల్లాలి" అంటూ ఆవేశంగా కనిపించబోతున్న మనోజ్ ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీఈ చీఫ్ గా .. ఓ స్టూడెంట్ గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు. ఈ సినిమాలో మనోజ్ జోడీగా అనీషా ఆంబ్రోస్ నటించింది.
"ఒక్కడు మిగిలాడు" సినిమా లేటెస్ట్ ట్రైలర్ బుధవారం విడుదలైంది. మనోజ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో దీనిని పంచుకున్నారు. "శ్రీలంకలో ఉంటే వాళ్లు శరణార్ధులన్నారు.. మా దేశమని ఇక్కడికి వస్తే మీరు శరణార్థులంటున్నారు. ఇది మా దేశం కాదా సార్.. అసలు మాకు దేశమే లేదా సార్.." అంటూ ఆవేదనతో మంచు మనోజ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.
శ్రీలంకలో తమిళులు అనుభవించిన మానసిక క్షోభను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.