Prakash Raj has claimed that he has respect for Rajinikanth and Kamal Haasan, but he will not support them in politics till they understand the problems the citizens facing in the country.
కుండ బద్ధలు కొట్టేలా మాట్లాడటంలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యవహారమే వేరుగా ఉంటుంది. తమిళ అగ్రహీరోలు కమల్ హాసన్, రజనీకాంత్‌లు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం నా దేశానికి ఓ విపత్తులాంటిదే అని ప్రకాశ్ రాజ్ అన్నాడు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని ఈ సందర్భంగా స్పష్టంచేశాడు. ముక్కుసూటిగా మాట్లాడే ఆయన.. ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు కొత్త కొత్త వివాదాలకు తెర తీసేలా ఉంటున్నాయి.
రజనీకాంత్.. కమల్ హాసన్ తో పాటు కన్నడ నటుడు ఉపేంద్రలు పార్టీ పెట్టి తమకు ఓట్లు వేయాలని అడిగితే వారికి ఓటు వేయద్దని తాను ప్రచారం చేస్తానని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. నటులుగా వారిపై ఉండే అభిమానానికి.. రాజకీయానికి వ్యత్యాసం ఉంటుందన్న ఆయన.. సదరు నటుల ఫ్యూచర్ ప్లాన్స్.. వారి ఆత్మస్థైర్యం చూసిన తర్వాత మాత్రమే ఓటు వేయాలన్నారు.
ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడే ప్రకాశ్‌రాజ్ మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా చేశాడు. సినిమా హాల్లో నిలబడి తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదని అతను స్పష్టంచేశాడు. గతంలోనూ గౌరీ లంకేష్ హత్యపై స్పందిస్తూ.. మోడీ తన కన్నా మంచి నటుడని, ఆయనకు తన అవార్డులు ఇచ్చేస్తానని ప్రకాశ్ అన్న విషయం తెలిసిందే.