Actor Sree Vishnu, who is enjoying the success of ‘Metal Madhilo’, is once again gearing up to enthrall the audience with his next ‘Needi Naadi Oke Katha’. The makers of the movie unveiled the first look motion teaser on Friday
శ్రీవిష్ణు, సత్నా టిటుస్ ప్రధాన పాత్రధారులుగా వేణు ఉడుగులను దర్శకుడిగా పరిచయం చేస్తూ అరాన్ మీడియా వర్క్స్ పతాకంపై కృష్ణవిజయ్, ప్రశాంతి లు నిర్మిస్తున్న చిత్రం నీదీ నాదీ ఒకేకథ.
నిజానికి ఈ సినిమా కొంతకాలంగా వార్తల్లో ఉంటూ వస్తోంది నిర్మాతకు బడ్జెట్ భారం అన్నది లేకుండా, కేవలం కథ, కథనంతో పాటు ఓ కొత్త టెక్నాలజీతో ప్రస్తుత సమాజ రీతులకు అద్దం పడుతూ రూపుదిద్దుకున్న సినిమా అన్న టాక్ ఈ నీది నాదీ ఒకే కథకి కొంత హైప్ తెచ్చింది.
అయితే తానేం చెప్పాలనుకుంటున్నాడో ఈ మోషన్ పోస్టర్లోనే స్పష్టం చేయాలనుకుంటున్నట్టున్నాడు దర్శకుడు. ప్రస్తుత విధ్యా విధానం మీదా, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్ ఒక వ్యర్థ ప్రయత్నం అని చెప్పాలన్నదే ఒక ఉద్దెశ్యమేమో అనిపించేలా ఉంది.
హీరో శ్రీవిష్ణు ఒక చోట గాయాలతో, పూర్తి డిప్రెసివ్ లుక్లో కనిపిస్తూనే మొహంలో ఒక అసహనం కనిపిస్తూ, సిగరెట్‌తో యాంగ్రీ అట్టిట్యూడ్ తో కనిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చ మాత్రం ఆ పోస్టర్లో తగలబడుతున్నట్టు కనిపిస్తున్న పుస్తకాలమీదే.