On the occasion of Venkatesh's birthday, the production house Haarika and Hassine creations have released a poster confirming that the project in the combinations of Trivikram and Venkatesh.
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఖరారైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో ప్రొడక్షన్ నెం.6గా ఈ చిత్రం తెరకెక్కనుంది. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ఖరారు చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేశారు.
త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోయేఈ చిత్రం వెంకీ కెరీర్లో 75వ చిత్రం కాబోతోంది. ఈ మూవీ 2019లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గురు' తర్వాత వెంకటేష్ బొమ్మరిల్లు భాస్కర్, తేజ, అనిల్ రావిపూడితో మూడు సినిమాలు కమిట్ అయ్యారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా మొదలు కానుంది.
దర్శకుడిగా మారక ముందు త్రివిక్రమ్ పలు చిత్రాలకు రచయితగా పని చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండే వెంకీతో త్రివిక్రమ్‌కు మంచి అనుబంధం ఉంది.
అయితే..వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తుందని చాలా కాలంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఇది నిజం కాబోతోంది. హారిక హాసిని బేనర్లో ప్రొడక్షన్ 6గా ఈ ఇద్దరి సినిమా రాబోతోందని పోస్టర్స్ విడుదలైన తర్వాత పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Comments