Megastar Chiranjeevi shave off his beard, appeared in a cleans shave that become a hot topic
గాసిప్ పుట్టడానికి 'గడ్డం' మేటర్ చాలు అన్నట్లు తయారైంది పరిస్థితి. ఏం చేసినా సినిమా కోసమే అని ముడిపెట్టి మాట్లాడేయడం సినీ వర్గాల్లో కొత్తేమి కాదు. మెగాస్టార్ చిరంజీవి గడ్డానికి, సైరా సినిమాకు ముడిపెట్టిన ఓ వార్త ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది.
కొత్త సంవత్సరం సందర్భంగా 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా సహా పలువురు చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోల్లో చిరు క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నారు.
నటుడు పొట్టి వీరయ్య కూడా చిరును కలిసి తనకు ఆర్థిక సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఆర్థిక సహాయం చేసినందుకు చిరంజీవి ఇంటికి వెళ్లి స్వయంగా కలిసి వీరయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వీరిద్దరు దిగిన ఫోటో బయటకు వచ్చింది. ఇందులోనూ చిరు క్లీన్ షేవ్‌తో కనిపించారు.
'సైరా' సినిమా కోసం ఫుల్లుగా గడ్డం పెంచేసి నిన్న మొన్నటిదాకా గుబురు గడ్డంతో కనిపించిన చిరు.. సడెన్‌గా ఇలా క్లీన్ షేవ్‌లో కనిపించారేంటబ్బా? అన్న సందేహం ఇప్పుడు చాలామందికి కలుగుతోంది.
అసలే సైరా సినిమాపై లేనిపోని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న తరుణంలో.. చిరు ఇలా క్లీన్ షేవ్ లో దర్శనమివ్వడంతో.. కొంపదీసి షూటింగ్ కొన్నాళ్ల పాటు రద్దు చేశారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.