Skip to playerSkip to main content
  • 9 years ago
The producers of Powerstar Pawan Kalyan’s 25th film ‘Agnyathavasi’ have made arrangements for special screening for Megastar Chiranjeevi and his family.



సినిమా వాళ్లకు కాస్త సెంటిమెంట్లు ఎక్కువే. పలానా ప్రదేశంలో ఒక్క సీన్ అయిన షూట్ చేయాలనో!..లేక సినిమాను మొదటగా తమ ఆత్మీయులకే చూపించాలనో.. ఇలా రకరకాల సెంటిమెంట్స్.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతీ చిత్రం మొదటగా ఆయన తండ్రి కృష్ణకే చూపిస్తారన్న సంగతి తెలిసిందే. సినిమాపై ఆయన చెప్పే టాక్ అక్షరాలా నిజమవుతుందనేది మహేష్ నమ్మకం. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అన్న మెగాస్టార్ మాటపై గురి. అందుకే 'అజ్ఞాతవాసి' ఫస్ట్ టాక్ ఆయన నుంచే వినాలనుకుంటున్నారు..
జనవరి 10న 'అజ్ఞాతవాసి' ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకు రెండు రోజుల ముందే మెగా కుటుంబం కోసం ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సినిమా చూశాక మెగాస్టార్ ఇచ్చే రిపోర్టుతో సినిమా హైప్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
'అజ్ఞాతవాసి' సినిమాను మెగాస్టార్ కుటుంబంతో కలిసి ప్రత్యేకంగా వీక్షిస్తుండటంతో వారి స్పందన ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది. మరీ ముఖ్యంగా చిరంజీవి ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ అభిమానులను వెంటాడుతోంది. చిరంజీవి గనుక సినిమా 'సూపర్బ్' అన్నారంటే ఫ్యాన్స్ కు ఇక పండుగే.

Recommended