Power star Pawan Kalyan has been in news ever since his Agnyaathavaasi was officially announced. It's no news that the actor-politician enjoys a huge fan following across the globe.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం దేశంలోనే కాదు.. ఓవర్సీస్లో కూడా హల్చల్ చేస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఫీవర్ అమెరికాను ఊపేస్తున్నది. యూఎస్‌లోని పవన్ అభిమానులు ప్రఖ్యాత హాలీవుడ్ స్టూడియో వద్ద హంగామా చేశారు.
అజ్ఞాతవాసి చిత్రం రిలీజ్ అవుతున్న సందర్భంగా లాస్ ఎంజెలెస్‌లోని హాలీవుడ్ స్టూడియో వద్ద ఫ్యాన్స్ పండుగ చేసుకొన్నారు. హాలీవుడ్ స్టూడియోకు సమీపంలో బ్యానర్లు, హోర్డింగ్‌లు కట్టి సంబరాలు జరుపుకొన్నారు.
అజ్ఞాతవాసి చిత్రంలోని మధురాపురి.. స్వాగతం కృష్ణ అనే పాటను పెట్టి ఓ వీడియోను షూట్ చేశారు. అజ్ఞాతవాసి చిత్రాన్ని ఘన విజయం సాధించేలా చేద్దాం. తిరుగులేని విజయం సాధిస్తుంది అంటూ ఆనందంతో డ్యాన్సులు చేశారు.
అజ్ఞాతవాసి సాధించే రికార్డులను, అధిగమించే మైలురాళ్లను తమతో షేర్ చేసుకోవాలని పవన్ కల్యాణ్ అభిమానులు లాస్ ఎంజెలెస్ ఫ్యాన్స్ కోరారు. అజ్ఞాతవాసి చిత్రంతో పవన్ అన్ని రికార్డులు తిరుగరాస్తారు. పవన్ చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.