Mahi Raghav’s biopic is on late Chief Minister YS Rajasekhar Reddy. The film will go on floors later this year. Mahi Raghav said “I’m nearly done with the script. It’s a very prestigious project so we’re taking things slow.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్ నిర్మాణ కార్యక్రమాలు వేగం పుంజుకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. 2009 హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన వైఎస్ఆర్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో నాగార్జున దివంగత నేతగా నటించే అవకాశాలున్నట్టు మీడియాలో ఓ వార్త షికారు చేస్తున్నది.
వైఎస్ఆర్ బయోపిక్‌ను విజయ్ చిల్లా, శశిధర్ దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇటీవల చిన్న చిత్రం విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకొన్న ఆనందో బ్రహ్మ చిత్రానికి దర్శకత్వం వహింిన మహి రాఘవ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
ఈ నేపథ్యంలో మహి రాఘవ మీడియాతో మాట్లాడుతూ.. స్క్రిప్టు వర్క్ పూర్తయిందని, వైఎస్ఆర్ పాత్రను పోషించడానికి ఏ నటుడిని ఇంకా సంప్రదించలేదు. మా పరిశీలనలో కొంతమంది నటీనటులు ఉన్నారు. ఇప్పుడే వారి పేర్లు బయటకు చెప్పడం భావ్యం కాదు అని మహీరాఘవ అన్నారు.
వైఎస్ఆర్ బయోపిక్‌లో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ పాత్రకు తెలుగు నటులైతే బాగుంటుందనే అభిప్రాయాల కారణంగా హీరో నాగార్జునతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.