Skip to playerSkip to main content
  • 9 years ago
Kala Bhandu T Subbirami Reddy organising Kakatiya Kala Vaibhava Mahotsavam in hyderabad. This celebration wil inaugarated by Maharastra Governor Vidya Sagar Rao. Dr Mohan Babu awareded with Vishwa Nata Sarwabouma

ఎప్పుడూ కళలను, కళాకారులను గౌరవిస్తూ, ప్రోత్సహించే మంచి మనసున్న మనిషి 'కళాబంధు' టి. సుబ్బరామిరెడ్డి. టీఎస్సార్ లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్టణం నగరాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. ఇప్పుడు కాకతీయుల వైభవాన్ని చాటి చెప్పే విధంగా 'కాకతీయ కళా వైభవ మహోత్సవం' నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా శనివారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ-ఈ నెల 17న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ వేడుక నిర్వహిస్తాం. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు చేతుల మీదుగా వేడుక ప్రారంభమవుతుంది. ఈ వేడుకలోనే సుమారు 560 చిత్రాల్లో నటించి, చిత్రపరిశ్రమలో 42 ఏళ్లు పూర్తి చేసుకున్న మోహన్ బాబును 'విశ్వ నట సార్వభౌమ' బిరుదుతో సత్కరిస్తున్నాం.
పలువురు ఆధ్యాత్మిక, రాజకీయ, సినీ, సాంస్కృతిక ప్రముఖులు ఈ మహోత్సవానికి హాజరు కానున్నారు.
మోహన్ బాబు మాట్లాడుతూ- "కళాకారులను, కళలను గౌరవించే వ్యక్తుల్లో టి. సుబ్బరామిరెడ్డిగారు ముందుంటారు. కాకతీయుల కళా వైభోగాన్ని ప్రజలకు చాటి చెప్పాలనుకోవడం అభినందనీయం. ఇక, నాకు ఇవ్వనున్న 'విశ్వ నట సార్వభౌమ' బిరుదు గురించి ముందు చెప్పగానే... 'బిరుదులు నాకు ఎందుకు?' అన్నాను. వద్దని చెప్పాను. మళ్లీ ఇప్పుడు ఇస్తున్నట్టు చెప్పారు. దాంతో ఆయన అభీష్టాన్ని కాదనలేకపోయా'' అన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత-నటుడు పరుచూరి గోపాలకృష్ణ, 'లయన్ క్లబ్' సభ్యులు, 'కాకతీయ కళా వైభవ మహోత్సవం' ఉత్సవ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు.

Recommended