Actress Namitha recenltly got married with his love interest veera. Both were attended for a Interview for youtube Channel. On that show, she revealed about her personla life.
తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నమిత దక్షిణాదిలో అగ్రతారగా వెలుగొందింది. తమిళ ప్రేక్షకులు ఆమె గ్లామర్‌కు నీరాజనం పట్టి గుడి కూడా నిర్మించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన నమిత ఇటీవల ప్రేమించిన వీరాను పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకొన్నది. ఇటీవల ఓ య్యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.
నా జీవితంలో ఓ విచిత్రమైన సంఘటన ఎదురైంది. నా అభిమాని ఒకరు నన్ను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకొన్నాడు.
నా జీవితంలో రెండుసార్లు సూసైడ్ చేసుకోవాలనుకొన్నాను. ఎన్నో ఏళ్లుగా ఓ వ్యక్తితో లవ్‌లో ఉన్నాను. ఆ వ్యక్తి దూరం కావడం వల్ల నేను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నానే ఫీలింగ్ కలిగింది.
లవ్ బ్రేకప్ జరగడంతో సినిమా అవకాశాలు పూర్తిగా కోల్పోయాను. సుమారు నాలుగు నెలలు ఇంటి నుంచి బయటకు రాలేదు. మానసికంగా కుంగిపోయాను. అలాంటి పరిస్థితుల్లో ఈ జీవితం వద్దనుకొన్నాను.
ఓ రోజు ఏడంతస్తులు అపార్ట్మెంట్ మీద నుంచి దూకి చావాలనుకొన్నాను. కానీ ధైర్యం చాలాలేదు.
మరోసారి కూడా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నాను. ఒక్కోసారి మూడు నిద్ర మాత్రలు తెచ్చుకొని మొత్తం 60 స్లీపింగ్ పిల్స్ సిద్ధం చేసుకొన్నాను. కానీ ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకొన్నాను.