Prabhas became a household name across the country after the Baahubali films took the box office by storm, and many actresses would give an arm and a leg to star in a film with him.
బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మారిపోయింది. ఎందరో బాలీవుడ్ నిర్మాతలు ప్రభాస్ ముందు క్యూ కట్టారు. అయితే ఏ ప్రాజెక్ట్ కూడా ఇంకా ఫైనల్ కాలేదు. కానీ తాజాగా ప్రభాస్ హీరోగా ఓ బాలీవుడ్ సినిమా పట్టాలెక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించేందుకు బిగ్‌బాస్11 సెలబ్రిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
బిగ్‌బాస్11లో క్వీన్ ఆఫ్ కాంట్రవర్సీగా అరుషి ఖాన్‌కు పేరుంది.
అయితే బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సంచలనాత్మకమైన ట్వీట్‌తో మరోసారి అరుషి వార్తలో నిలిచింది. తాను ఓ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించేందుకు ఒప్పుకొన్నాను. బాహుబలి స్టార్ ప్రభాస్ సరసన నటిస్తున్నాను అని ట్వీట్ చేసింది.
బిగ్‌బాస్ కారణంగానే నాకు ప్రభాస్ చిత్రంలో నటించే అవకాశం లభించింది. అందుకు 11 మంది సెలబ్రిటీలకు, సల్మాన్ ఖాన్‌కు ధన్యవాదాలు అని ట్వీట్లో పేర్కొన్నది. అరుషీ ట్వీట్ చూసిన కొందరు కంగుతిన్నారు. అరుషికి ప్రభాస్ పక్కన నటించే అవకాశామా అని ముక్కున వేలేసుకొన్నారు.
ప్రభాస్ చిత్రంలో నిజంగా నటిస్తున్నదా అనే విషయాన్ని ధృవీకరించుకోవడానికి అరుషిని సంప్రదించగా.. మీరు విన్న వార్త నిజమే. ప్రభాస్ జంటగా నటిస్తున్నాను. కొద్దిరోజుల్లో మీకే అన్ని విషయాలు అధికారికంగా తెలుస్తాయి.