Dialouge writer Lakshmi Bhupal recently gave an interview about his film journey in tollywood. He shared his personal struggle.
'అలా మొదలైంది' సినిమాతో అందరి దృష్టిలో పడ్డ రచయిత లక్ష్మీ భూపాల్. సంభాషణల రచయితగానే కాక.. గేయ రచయితగానూ ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది 'నేనే రాజు నేనే మంత్రి'తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ స్థాయికి ఎదిగిన లక్ష్మీ భూపాల్.. ఒకప్పుడు మెకానిక్ గా పనిచేశారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోతే.. అప్పటినుంచి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఇక్కడిదాకా వచ్చారు. ఆ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి ఆయన మాటల్లోనే..
మా స్వగ్రామం ఏలూరు. పుట్టిందీ, పెరిగిందీ, చదువుకుందీ అంతా అక్కడే.
జీకే వద్ద కొన్నాళ్లు సహాయకుడిగాను.. అలాగే రాఘవేంద్రరావు 'విజన్ 2020'కోసం పనిచేశాను. ఆ తర్వాత అనుకోకుండా మళ్లీ ఏలూరు వెళ్లి అక్కడే నాలుగేళ్లు ఉండాల్సి వచ్చింది. తిరిగొచ్చాక.. ఓరోజు హాస్యనటుడు లక్ష్మీపతి గారిని కలిశాను. 'మీరు రైటర్ కదా..' అంటూ రవిబాబు వద్ద ప్రయత్నిస్తారా? అని అడిగారు. అలా తొలిసారి సినిమా బీజం పడింది.
రెండో రోజు వెళ్తే పట్టించుకోలేదు. మూడో రోజు సెట్‌కి వెళ్తే... అసలు అక్కడ షూటింగే లేదు. అర్జెంటుగా రవిబాబు నంబరు కనుక్కుని ఫోన్ చేసి తిట్టేద్దామనిపించింది. కానీ ఇంతలోనే రామానాయుడు స్టూడియోకు రావాలని ఫోన్ కాల్. దీంతో ఆ కోపమంతా ఎగిరిపోయింది. అప్పటికే పరుచూరి బ్రదర్స్, నివాస్ రెండు వెర్షన్స్ రాశారు. కానీ కొత్తగా రాయాలని రవిబాబు ఆ సీన్స్ నాకిచ్చారు. అప్పటికీ సీన్స్ ఎలా రాస్తారో కూడా నాకు తెలియదు. వాళ్లు రాసింది చూసి ఆ ఫార్మాట్ లో రాసేశాను. లక్కీగా అది వాళ్లకు నచ్చేయడంతో 'సోగ్గాడు'తో రచయితగా నా ప్రయాణం మొదలైంది.
'సోగ్గాడు'కి పనిచేస్తున్న సమయంలో.. ఫస్ట్ సీన్ రాసినప్పుడు 'ప్రేమొచ్చింది' అని ఓ పదం రాశాను. అది చూసి రవిబాబుకు చిర్రెత్తుకొచ్చింది. 'జ్వరమొచ్చింది, కోపమొచ్చిందిలా ఈ ప్రేమొచ్చింది ఏంటి? బాగాలేదు.. మార్చేయ్' అన్నారు. నేను మాత్రం.. 'ఇదో ఇదో కొత్త ఎక్స్ప్రెషన్. మార్చడం కుదరదు' అని పెన్నూ పేపరూ పక్కన పడేసి వెళ్లిపోయాను.