Actress Jyothika responded over the controversial dialogue in Nachiyar film. Jyothika clearly said that so many hero's are used that dialogue in their film in past.
బాలా.. ఒక అసాధారణ దర్శకుడు. సాదాసీదా రొడ్డకొట్టుడు కథల జోలికి పోవడానికి ఏమాత్రం ఇష్టపనివాడు. సమాజపు అట్టడుగు జీవితాల్లోని అపసామాన్య వ్యక్తిత్వాలు, అందులోని యథార్థత.. బాలా సినిమాలకు కథాంశాలు. అందుకే ఆయన సినిమాల్లో సంభాషణలు కూడా పచ్చిగానే ఉంటాయి. ఇదే పరంపరలో ఆయన నుంచి రాబోతున్న మరో సినిమా 'నాచియార్'. ఇందులో జ్యోతిక చెప్పిన ఒక 'బూతు' డైలాగ్ పై పెద్ద దుమారమే రేగుతోంది. ఇప్పటి వరకు దానిపై స్పందించని జ్యోతిక తాజాగా నోరు విప్పారు..
టీజర్లో నేను చెప్పిన డైలాగును వివాదం చేశారు. నిజానికి అలాంటి పదాన్ని చాలామంది హీరోలు ఇప్పటికే వాడేశారు. అప్పుడెవరూ దాని గురించి అడగలేదు. కానీ ఒక నటిగా నేను చెబితే మాత్రం ఇంత పెద్దది చేసి చూపిస్తున్నారు.
నాచియార్' కథ ప్రకారం సినిమాలో అలాంటి డైలాగ్స్ చాలానే చెప్పాల్సి ఉంది. ఎందుకంటే.. ఆ పాత్ర అలాంటిది. కానీ చాలావరకు తగ్గించే మాట్లాడాను.
నాచియార్ 'టీజర్'లో జ్యోతిక చెప్పిన 'తెవిదియా' అన్న పదంపై అక్కడి మహిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి బూతు పదాన్ని జ్యోతిక పలకడంపై వారు మండిపడుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పటికే కోర్టు మెట్లు కూడా ఎక్కింది.