Skip to playerSkip to main content
  • 9 years ago
Varun Tej's Tholiprema movie grand release from tomorrow. But in US this movie releasing today only. US premiers are already done. Good responce for the movie.

వరుణ్ తేజ్ నటించిన రొమాంటిక్ లవ్ డ్రామా తొలిప్రేమ చిత్రం ఫిబ్రవరి 10 నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కానీ యుఎస్ లో ఈ చిత్రాన్ని ఒకరోజు ముందుగా అంటే నేడు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీమియర్ షోలు యుఎస్ లో ప్రదర్శించబడ్డాయి. యుఎస్ అభిమానుల నుంచి ఈ చిత్రానికి మంచి టాక్ వస్తోంది. రొమాంటిక్ లవ్ స్టోరీ తరహా చిత్రాలు యుఎస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి.
రాశి ఖన్నా, వరుణ్ తేజ్ జంటకు టీజర్ ట్రైలర్ లో ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. తొలిప్రేమ చిత్రానికి యుఎస్ ప్రీమియర్స్ నుంచి సూపర్ పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
తొలిప్రేమ చిత్రంలోని అన్ని పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా థమన్ అదరగొట్టేశాడు. థమన్ వర్క్ కు ప్రశంసలు దక్కుతున్నాయి.
తొలిప్రేమ చిత్ర ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునే విధంగా ఉంది. వరుణ్, రాశి ఖన్నా తమ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు.
తొలిప్రేమ చిత్ర సెకండ్ హాఫ్ కు కూడా మంచి మార్కులే పడ్డప్పటికీ కొన్ని సన్నివేశాలు సాదా సీదాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓవర్ ఆల్ గా సెకండ్ హాఫ్ ఒకే అనిపించే విధంగా ఉంది.
వరుణ్ తేజ్, రాశి ఖన్నా మధ్య కెమిస్ట్రీ అదిరింది. ఈ జంట కన్నుల విందుగా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీకి కూడా మంచి మార్కులు పడ్డాయి.

Recommended