Sai Dharam Tej's Intelligent movie became disaster at box office. Naga Chaitanya Akkineni was first chioce this movie. But Chaitu was rejected because of story.
సినీ పరిశ్రమలో ఓ హీరో వదిలేసుకొన్న సినిమాలను మరో హీరో చేసి హిట్టుకొట్టిన సందర్భాలను అప్పుడప్పుడు చూస్తుంటాం. అలానే ఒక హీరో వద్దనుకొన్న కథను మరో హీరో పట్టుకొని చేతులు కాల్చుకొన్న సందర్భాలు లేకపోలేదు. తాజాగా అలాంటి సంఘటనే టాలీవుడ్‌లో కనిపించిందనే వార్త మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు అలా బలైన వారిలో సాయిధరమ్ తేజ్ ఒకరు. ఇంతకీ ఏమి జరిగిందంటే..
ఇంటిలిజెంట్ అట్టర్‌ఫ్లాప్ అని డిసైడ్ అయిన తర్వాత ఓ ఆసక్తికరమైన స్టోరి మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఇంటిలిజెంట్ కథను ముందుగా ఆకుల శివ అక్కినేని నటవారసుడు నాగచైతన్యకు వినిపించాడట.
కథ, కథనాలు విభిన్నంగా లేకపోవడం లాంటి అంశాలను నాగచైతన్య ముందే పసిగట్టాడట. దాంతో ఈ సినిమా నాకు వర్కవుట్ కాదని చైతూ చేతులు దులిపిసుకొన్నాడు. ఆ తర్వాత పాత చింతకాయ పచ్చడి కథ సాయిధరమ్ తేజ్ ముందు పెట్టాడు.
నిర్మాత సీ కల్యాణ్ కథపై కొంత సానుకూలంగా ఉండటం, ఈ ప్రాజెక్ట్ చేయడానికి దర్శకుడు వినాయక్ రంగంలోకి దిగడంతో సాయిధరమ్ తేజ్ బుట్టలోపడిపోయాడు. అంతేకాకుండా కథా, రచయిత ఆకుల శివ, దర్శకుడు వినాయక్ కాంబినేషన్‌కు మంచి క్రెడిట్ కూడా ఉండటంతో సాయిధరమ్ తేజ్ ఏదో మ్యాజిక్ అవుతుందని ఫిక్సైపోయాడు.
టాగోర్, ఖైదీ నంబర్ 150 లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన వినాయక్ నుంచి ఇలాంటి సినిమాను చూసిన ప్రేక్షకులు, మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు వినాయక్ ఇలాంటి సినిమాను తీస్తాడా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.
Comments