Sai Dharam Tej's Intelligent movie become disaster at box office. But Vinayak have not saved Sai Dharam Tej from flops. But he saved the buyers by giving 5 crores back.
టాలీవుడ్లో భారీ చిత్రాలు ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద భారీగానే బోల్తా కొడుతున్నాయి. 2018 సంవత్సరం మెగా హీరోలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకోగా.. ఆ తర్వాత వచ్చిన సాయిధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ చిత్రం ఊహించని ఫ్లాప్‌ను చవిచూసింది. ఇంటిలిజెంట్ సినిమా దర్శకుడు వినాయక్ ప్రవర్తించిన తీరు ఇప్పడు మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.
అజ్ఞాతవాసి, ఇంటిలిజెంట్ చిత్రాలు డిస్టిబ్యూటర్లకు దారుణమైన నష్టాల్ని తెచ్చిపెట్టాయి. అజ్ఞాతవాసి చిత్రం వల్ల నిర్మాత, డిస్టిబ్యూటర్లు చవిచూసిన నష్టాల్నికొంత తగ్గించేందుకు దర్శకుడు త్రివిక్రమ్ తన రెమ్యునరేషన్లో కొంత భాగాన్ని వెనుకకు తిరిగి ఇచ్చినట్టు సమాచారం.
తాను దర్శకత్వం వహించిన చిత్రం భారీ నష్టాల్ని మిగల్చడంతో నిర్మాత, డిస్టిబ్యూటర్లను ఆదుకోవడానికి వినాయక్ ముందుకొచ్చాడట. తాను తీసుకొన్న 9 కోట్ల రెమ్యునరేషన్ నుంచి సుమారు రూ.5 కోట్లను తిరిగి ఇచ్చేశాడట. వినాయక్ అనుసరించిన తీరుపై సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి
వినాయక్ ఇలా వ్యవహరించడం మొదటిసారి కాదు. అఖిల్ సినిమా దారుణంగా బోల్తా కొట్టినప్పడు కూడా తన రెమ్యునరేషన్లో నుంచి కొంత మొత్తాన్ని తిరిగి ఇవ్వడం సంచలనం రేపింది. అఖిల్ సినిమా బయ్యర్లను, నిర్మాతను ఆదుకోవడానికి రూ.5 కోట్లు వెనుకకు తిరిగి ఇచ్చాడనేది అప్పట్లో సంచలనం రేపింది.