Skip to playerSkip to main content
  • 9 years ago
Varun Tej and Raashi Khanna’s romantic film Tholi Prema has begun its run at the box office on a high note. In this occassion, Chirajeevi felicitated Tholi Prema Unit.

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా జంట‌గా వెంకీ అట్లూరీ ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన తొలిప్రేమ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం ఉద‌యం మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ స‌భ్యులు హీరో వ‌రుణ్ తేజ్, ద‌ర్శ‌కుడు వెంకీ, నిర్మాత వి.వి.ఎస్ .ఎన్ ప్ర‌సాద్, బాపినీడుల‌ను హైద‌రాబాద్ లోని త‌న ఇంటికి ఆహ్వానించి స‌న్మానించారు.
అనంత‌రంమెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. తొలిప్రేమ పెద్ద స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా టీమ్ అంద‌రికీ అభినంద‌న‌లు. సినిమా ఆల‌స్యంగా చూశాను. సినిమా చూసి చాలా ఇన్ స్పైర్ అయ్యాను. నా సోదరుడు ప‌వ‌న్ కల్యాన్ నటించిన తొలిప్రేమ సినిమా టైటిల్‌తో వ‌చ్చిన సినిమా అని చాలా క్యూరియాసిటీ కలిగింది. ఇదొక‌ కాంటెప్ర‌రరీ ల‌వ్ స్టోరీ. క‌థ క‌న్నా సిచ్వేష‌నల్‌గానే సినిమా అంతా ఉంటుంది.
తెలుగు ప‌రిశ్ర‌మ గ‌ర్వ‌ప‌డే సినిమా తొలిప్రేమ. న‌టీన‌టులంతా పాత‌వాళ్లే. కానీ అన్ని పాత్ర‌లు చాలా కొత్త‌గా క‌నిపించాయి. వ‌రుణ్ తేజ్ చాలా మెచ్యూర్డ్ గా న‌టించాడు. సినిమాలో త‌న‌ని చూస్తున్నంత సేపు ఎవ‌రో యంగ్ బాయ్ న‌టిస్తున్న‌ట్లు అనిపించింది. ప్రేమ స‌న్నివేశాలు...ఇగో క్లాషెస్ స‌న్నివేశాల్లో వ‌రుణ్, రాశీఖ‌న్నా చాలా ఇన్వాల్వ్ అయి చేశారు.
వ‌రుణ్ పెర్పామెన్స్ చూసి మా ఫ్యామిలీ అంతా గ‌ర్వ‌ప‌డుతోంది. వరుణ్ ఎత్తుకు డాన్సులు ఎంత వ‌రకు కుదురుతాయ‌ని లోలోప‌ల అనుమానం ఉండేది. కానీ ప్ర‌తీ స్టెప్ ను బాగా అడాప్ట్ చేసుకుని చేశాడు. అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌ను అల‌రించే క‌మ‌ర్శియ‌ల్ సినిమా ఇది. తొలిప్రేమ స‌క్సెస్ నాగ‌బాబుకి ప్రైడ్ మూమెంట్. వ‌రుణ్ వాళ్ల నాన్న‌కి మంచి బ‌హుమ‌తి ఇచ్చాడు` అని అన్నారు.
వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ, `నాకు యాక్ట‌ర్ అవ్వాల‌న్న ఆలోచ‌న చిరంజీవి గారిని చూసే వ‌చ్చింది. ఈ రోజు డాడి వ‌చ్చి మంచి మాట‌లు చెబుతుంటే చాలా సంతోషం గా ఉంది` అని అన్నారు. థ‌మ‌న్ మాట్లాడుతూ, ` నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయ‌న మ‌మ్మ‌ల్ని గుర్తించి పిలిపించి....ప్ర‌శంసించ‌డం మాకు చాలా ఆనందాన్నిస్తుంది. ఇంట‌ర్ పాస్ అయి డిగ్రీకి వెళ్లున్న ఫీలింగ్ క‌ల్గుతుంది` అని అన్నారు.

Recommended