Star film Choreographer Rakesh Master speaks in an Interview. He said about his journey in film industry. He made serious comments on Sekhar Master, Krishna Vamsi and Ram Gopal Varma.
తెలుగు సినీ పరిశ్రమలో రాకేష్ మాస్టర్ స్టార్ కోరియోగ్రాఫర్. ముక్కుసూటిగా వ్యవహరిస్తాడు. ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే వాడిగా మాటలు సంధిస్తాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణవంశీ, రాంగోపాల్ వర్మలపై ధ్వజమెత్తాడు. వారిద్దరిపై దారుణమైన కామెంట్లు చేశాడు. రాకేష్ మాస్టర్ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..
శేఖర్‌ను మాస్టర్ చేసింది నేనే. కానీ కొన్ని కారణాల వలన మా మధ్య చాలా విభేదాలు చోటుచేసుకొన్నాయి. వాటిని నేను చెప్పలేను. గురువును వదిలేసి చాలా దూరంగా వెళ్లాడు. అతడిని వెతుక్కొంటూ నేను వెళ్లాను. అందుకే నేను చనిపోయినా నా శవాన్ని శేఖర్ తాకకూడదు.
కృష్ణవంశీ నాకు తెలుసు అని ఫీలవుతాడు. ఎదుటి వ్యక్తికి ఏమీ తెలియదు అనే వెధవ బుద్ధి ఉంది. అతడి ప్రవర్తన బాగుండదు. చేతిలో సిగరెట్ పట్టుకొని నీకు డ్యాన్స్ వచ్చా? అని ప్రశ్నించాడు. దాంతో మా మధ్య చెడింది.
సర్కార్ సినిమా నుంచి రాంగోపాల్ వర్మ అంటే చాలా ఇష్టం. 5డీ కెమెరాలతో సినిమాను నాశనం చేస్తున్నాడని ఒక వ్యక్తి ఆయనను తిడితే నేను ఒప్పుకోలేదు. కానీ అతడిని కలిసిన తర్వాత వర్మ వెధవ.. అతను ఓ శాడిస్టు అని తెలిసింది. సంప్రదాయ దేశంలో తన తల్లిని వర్మ అలా చూపిస్తాడా? ఏదో సమయంలో భర్తతో కలిసి వర్మ కూతురు బయటకు వస్తే.. నీ తండ్రి మియా మాల్కోవాను అలా చూపించాడు. నిన్ను కూడా చూపించాలా అని ఎవడైనా అంటే ఏమిటి పరిస్థితి. జీఎస్టీ లాంటి సినిమా తీయడం చాలా తప్పు.
ఇంకా హిందూ సంప్రదాయం చచ్చిపోలేదు. మన సంప్రదాయన్ని మంట గలుపుతున్నాడు. జీఎస్టీ ద్వారా సెక్స్ బహిరంగం చేసిన వర్మను చెప్పుతో కొడుతారు. బట్టలు ఊడదీసి ఎక్కడో వర్మ కొట్టడం ఖాయం.
జీఎస్టీ తీసిన మహిళలందరూ పక్కాగా ప్లాన్ చేసి ఎక్కడ ఉంటాడో అని తెలుసుకోవాలి. కారులో వెళితే వాడిని నడిరోడ్డు మీద దించి బట్టలూడదీసి కొట్టాలి. ఇదంతా జీఎస్టీ పార్ట్2కు ముందే జరిగాలి.