• 9 years ago
Female centric controversies continuing in Bollywood. Even Sridevi lastrites also became controversy

సమాజంలో పురుషాధిక్య ప్రభావం ఎక్కువగా ఉంది. పాశ్చాత్త దేశాలలో కూడా పురుషాధిక్యం ఎక్కువగా కనిపిస్తుంది కానీ భారత ఉపఖండంలో ఉన్నత ఎక్కువగా ఈ ప్రభావము అక్కడ ఉండదు.
చిత్ర పరిశ్రమలో ఏవైనా పుకార్లు పుడితే మొదటగా బలయ్యేది హీరోయిన్లే. చిత్ర పరిశ్రమలో పుకార్లన్నింటిని హీరోయిన్ సెంట్రిక్ గానే సృష్టిస్తారు. ఇదో రకమైన పైశాచిక ఆనందం అంటూ పలువురుప్రముఖులు మండి పడుతున్నారు. . దిగ్గజ నటి శ్రీదేవి మృతితో ఈ అంశం మరో మరు తెరపైకి వచ్చింది.
వాడియా అనే వ్యాపారవేత్తతో ప్రీతి జింతా 2009 లో సహజీవనం ప్రారంభించింది. ప్రీతి సహజీవనం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతా ప్రీతి జింతా గురించే చర్చించుకున్నారు.
లైంగిక వేధింపుల వివాదంతో ఆ తరువాత వాడియా నుంచి ప్రీతి జింతా విడిపోయింది. ఈ వివాదం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఇన్ని రోజులు కలసి ఉండగా లేదని, ఇప్పుడు ఈ లైంగిక వేధింపులు ఏంటి అంటూ ప్రితిపై కామెంట్లు కూడా వినిపించాయి.
కంగనా రనౌత్, హృతిక్ రోషన్ ఈ మెయిల్స్, ప్రేమ లేఖల వ్యవహారం కూడా బాలీవుడ్ లో పెను దుమారం రేపింది. కంగనా రనౌత్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తోందటూ హృతిక్ రోషన్ అప్పట్లో మీడియా కుందుకు వచ్చాడు కూడా. ఏ వ్యవహారం కంగనా రనౌత్ ని బాగా డిస్ట్రబ్ చేసింది. మానసికంగా కంగానా కుంగిపోయింది.
కంగనా తరువాత కెరీర్ లో సెటిల్ అయ్యాక ఈ విషయం గురించి ధైర్యంగా మాట్లాడడం మనం విన్నాం. కంగనా విషయంలో జరిగింది, వేరెవరైనా మేల్ యాక్టర్ చేసి ఉంటె ఇంత సీన్ జరిగి ఉండేది కాదని కొందరి వాదన
శ్రీదేవి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర వేదన అనుభవిస్తున్న తరుణంలో కొందరు ఈ విషయంలో కూడా శ్రీదేవిని దోషిగా చూపించే ప్రయత్నం చేసారు.

Recommended