Skip to playerSkip to main content
  • 9 years ago
Kalyan rams next movie MLA which is going to be Launch on 23rd of march and conducting audio launch event on March 17th. Rumour raises that NTR is returning from usa to attend MLA movie audio Launch Event.

ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా మహర్దశలో కొనసాగుతున్నాడు. త్రివిక్రమ్, రాజమౌళి చిత్రాలలో నటించేందుకు ఎన్టీఆర్ సిద్ధం అవుతున్నాడు. రాంచరణ్, ఎన్టీఆర్ తో కలసి రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబందించిన వర్క్ షాప్ లో పాల్గొనేందుకు ఎన్టీఆర్, చరణ్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమా విషయంలో ఎన్టీఆర్ ఎంత డెడికేషన్ చూపిస్తాడో కుటుంబ బంధాలకు కూడా అంతే విలువ ఇస్తాడు. అమెరికాలో ఉన్న ఎన్టీఆర్ అన్న కోసం ఇండియా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇది నందమూరి అభిమానులు పండగ చేసుకునే వార్తే ఇది.
ఇక ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు చిత్రాలతో నటిస్తున్నాడు. ఒకటి ఎమ్మెల్యే చిత్రం మరొకటి నా నువ్వే. అయితే ఎమ్మెల్యే చిత్రం గురించి అంతటా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ఈ చిత్ర టీజర్ కూడా ఆకట్టుకుంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్స్, స్టిల్స్ ని పరిశీలిస్తే కాజల్, కళ్యాణ్ రామ్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తుంది. ఇక ఈ ఎమ్మెల్యే చిత్రం మార్చ్ 23 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.
కాగా 17 వ తేదీ భారీ స్థాయిలో ఎమ్మెల్యే చిత్రం ఆడియో వేడుక నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్ర ఆడియో వేడుకకు ఎన్టీఆర్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా లాస్ ఏంజెల్స్ లో ఉన్న ఎన్టీఆర్ ఆడియో వేడుక కోసం త్వరలోనే హైదరాబాద్ తిరిగి వస్తాడనే వార్త ప్రస్తుతం షికారు చేస్తుంది, ఇక దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. సోదరుడి ఆడియో వేడుకకు ఎన్టీఆర్ హాజరైతే అభిమానులకు పండగే అనిచెప్పవచు.

Recommended