Singer Aditya Narayan Arrested After Car Hits Rickshaw. He gets bail immediately.
ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్ బాధ్యత రాహిత్యంగా కారు నడిపి ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలు కావడానికి కారణం అయ్యాడు. పోలీస్ లు ఆదిత్య నారాయణ్ ని అరెస్ట్ చేసారు. ముంబై లో ఈ ఘటన జరిగింది. సెలెబ్రిటీ కొడుకు కావడంతో అంతలోనే ఆదిత్య నారాయణ్ కు బెయిల్ లభించింది.
ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకుగా వారసత్వంలో ఆదిత్య నారాయణ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆదిత్య నారాయణ్ నటించాడు. ప్రస్తుతం సింగర్ గా, నటుడిగా ఆదిత్య నారాయణ్ బాలీవుడ్ లో రాణిస్తున్నాడు.
తన బెంజ్ కారులో ప్రయాణిస్తున్న ఆదిత్య నారాయణ్ యూ టర్న్ వద్ద కూడా వేగాన్ని అదుపు చేయకుండా ప్రమాదానికి కారణం అయ్యాడు. ఆదిత్య నారాయణ్ రాష్ డ్రైవింగ్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదాలో ఆటో రిక్షా డ్రైవర్ తో పాటు, అందులోని లేడీ ప్యాసింజెర్ కూడా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీస్ లు గాయపడ్డ వారి వాంగ్మూలాన్ని తీసుకుని ఆదిత్య నారాయణ్ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది
పోలీస్ లు ఆదిత్య నారాయణ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.సెలెబ్రిటీ కొడుకు కావడంతో అంతలోనే ఆదిత్య నారాయణ్ కు బెయిల్ లభించింది. అతడి కుటుంబ సభ్యులు బెయిల్ తో వచ్చి ఆదిత్యని విడిపించుకుపోయినట్లు తెలుస్తోంది.