Salman Khan copied Prabhas's Saaho stunt. Race 3 trailer gets trolling
#Race 3
#Saaho
#SalmanKhan
కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన రేస్ 3 చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలైంది. యాక్షన్ ప్రియులకు ఈ ట్రైలర్ నచ్చుతోంది కానీ కామన్ ఆడియన్స్ కి మాత్రం నచ్చడం లేదు. బాలీవుడ్ యాక్షన్ చిత్రాలలో కనిపించిన సన్నివేశాలే రేస్ 3 ట్రైలర్ లో కూడా కనిపిస్తున్నాయని పెదవి విరుస్తున్నారు. సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
రేస్ 3 ట్రైలర్ లో సల్మాన్ ఖాన్, జాక్వలిన్ పెర్నాండెజ్ శిఖరం నుంచి దూకే సన్నివేశం ఉంటుంది. ఆ స్టంట్ ను ప్రభాస్ సాహూ చిత్రం నుంచి కాపీ చేసారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
సాహో చిత్ర టీజర్ గత ఏడాది విడుదల చేసారు. టీజర్ చివర్లో ఎత్తైన భవనం నుంచి మాస్క్ ధరించి ఉన్న ఇద్దరు వ్యక్తులు దూకే స్టంట్ ఉంటుంది. ఆ ఇద్దరూ ప్రభాస్, శ్రద్ధా కపూర్ అయి ఉంటారని అంటున్నారు. అదే స్టంట్ రేస్ 3 లో కనిపించడంతో గత చిత్రాల యాక్షన్ సన్నివేశాలల్ని కాపీ చేసి రేస్ 3 తెరకెక్కించారని విమర్శలు ఎక్కువవుతున్నాయి.
ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్నా ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం 2018 లోనే విడుదల కావలసింది. కానీ షూటింగ్ ఆలస్యం జరుగుతుండడంతో 2019 లో విడుదల చేయనున్నారు
Comments