ప్రముఖ నటి శ్రీదేవి కూతురు కావడం, 'ధడక్' సినిమా ద్వారా త్వరలో హీరోయిన్‌గా పరిచయం అవుతున్న నేపథ్యంలో జాహ్నవి కపూర్ ఫాలోయింగ్ క్రమక్రమంగా పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. ఇలా పాపులారిటీ పెరిగిన కొద్దీ సెలబ్రిటీలకు ఇబ్బందులు సైతం పెరుగుతుంటాయి. ఎక్కడికి వెళ్లినా అభిమానులు చుట్టుముట్టడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటివి ఇపుడు జాహ్నవి కపూర్ కూడా ఎదుర్కొంటోంది. ఇటీవల ముంబైలో జాహ్నవికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చిన్నారుల బృందంతో పాటు కొందరు ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టారు.
Comments