Bahubali team will work for Saakshyam movie. Bellakonda Srinivas and Pooja hegde are main leads
#Bahubali
#Saakshyammovie
#BellakondaSrinivas
#Poojahegde
యువ కథానాయకుడు బెల్లం కోసం శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా ఎదిగేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. అతడు నటించిన అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకి నాయక వంటి చిత్రాలు భారీ బడ్జెట్ తో నిర్మించినవే. బెల్లంకొండ శ్రీనివాస్ కష్టానికి గుర్తింపు లభిస్తున్నా సరైన విజయం మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం నటిస్తున్న సాక్ష్యం చిత్రం ద్వారా ఆ లోటు తీరుతుందని ఈ యువహీరో ఆశలు పెట్టుకుని ఉన్నాడు. కమర్షియల్ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా సాక్ష్యం చిత్రం వస్తున్న వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
సాక్ష్యం జూన్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వలన ఈ చిత్రాన్ని జులై కు వాయిదా వేశారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంలో భారీ స్థాయిలో గ్రాఫిక్స్ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర టీజర్ చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. టీజర్ లో అద్భుతమైన విజువల్స్ చూపించారు. ఇదేదో సోషియో ఫాంటసీ తరహా చిత్రంగా అనిపిస్తోంది.