Skip to playerSkip to main content
  • 8 years ago
బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ తన 20 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలకబోతున్నాడు. భార్య మెహర్ జెస్సియాతో విభేదాలు కారణంగా వేర్వేరుగా నివసిస్తున్న వీరు విడాకుల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. వీరి కాపురంలో కలతలు నెలకొనడానికి కారణం హృతిక్ భార్య సుసానే ఖాన్ అనే మాట వినిపిస్తున్నది. విడాకుల కోసం దరఖాస్తు చేసుకొన్న తర్వాత ఈ మాట మరింత బలంగా ప్రచారమవుతున్నది
2013 సంవత్సరంలో బాలీవుడ్ సెన్సేషన్ హృతిక్ రోషన్, సుసానే ఖాన్‌ విడిపోవడం సంచలనం రేపింది. హృతిక్ దంపతులు విడిపోవడానికి కారణం అర్జున్ రాంపాల్ అనే రూమర్ విస్తృతంగా ప్రచారమైంది. ఆ తర్వాత సుసానేకు అర్జున్ దగ్గర కావడం మెహర్‌లో అభద్రతాభావం పెరిగింది. దాంతో అర్జున్, మెహర్ మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరినట్టు సమాచారం.
సిగరెట్ తాగినప్పుడు వచ్చే పొగలో కూడా ఆడతనం కనిపించడానికి కారణం సుసానే అని అర్జున్ రాంపాల్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. వారి మధ్య సన్నిహిత సంబంధాలు ఆ డైలాగ్‌తో బజారుకెక్కాయి.
ఓ దశలో బాలీవుడ్‌లో అర్జున్ రాంపాల్ పరిస్థితి చాలా దిగజారింది. చేతిలో అవకాశాలు తగ్గిపోయాయి. స్నేహితులు దూరమయ్యారు. ఆ సమయంలోనే సుసానేకు దగ్గరయ్యాడు. అప్పుడే మెహర్‌లో అభద్రతాభావం పెరిగింది. తరచూ వారి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి.

Recommended