Rajinikanth's Kaala movie getting ready to release on June 7th. In this occassion, Kaala Audio function organised in Hyderabad on June 4th.
సూపర్‌స్టార్ రజనీకాంత్ కాలా చిత్రం కోసం మరోసారి గ్యాంగ్‌స్టర్ అవతారం ఎత్తారు. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 7వ తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. కబాలి తర్వాత రజనీకాంత్‌తో పా రంజిత్ వరుసగా మరో సినిమాను రూపొందించడం గమనార్హం. ముంబైలోని మురికివాడ ధారవిలో నివసించే తమిళ వలస జీవుల హక్కుల కోసం పోరాడే పాత్రలో రజనీకాంత్ కనిపించనున్నారు. అయితే రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్ చిత్రాల్లో కనిపించడం తొలిసారి కాదు. ఆ చిత్రాలు ఏమిటంటే..
80వ దశంలో హిందీలో ఘన విజయం సాధించిన అమితాబ్ బచ్చన్ చిత్రాలను రీమేక్‌గా మలిచి రజనీకాంత్ నటించారు. అందులో భాగంగానే డాన్ (తెలుగులో యుగంధర్) చిత్రాన్ని తమిళంలో బిల్లాగా తెరకెక్కించారు. మాఫియా నాయకుడు ప్రమాదంలో చనిపోవడం, అలాగే ఉండే మరో పల్లెటూరి యువకుడు గ్యాంగ్‌స్టర్‌గా చెలామణి అవుతారు. ఈ చిత్రం దాదాపు 25 వారాలు నిర్విరామంగా ఆడింది.
ఆ తర్వాత తెలుగులో ఘనవిజయం సాధించిన ధర్మపత్ని (కృష్ణంరాజు, జయసుధ) చిత్రాన్ని నల్లవనుకు నల్లావన్ చిత్రంగా తమిళంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రజనీ మాణిక్యం అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించారు. ఆయన పత్నిగా రాధిక శరత్ కుమార్ కనిపించారు. ఈ చిత్రంలో మాణిక్యంగా రజనీ నటన ఇప్పటికీ అత్యుత్తమే. ఈ చిత్రం తమిళనాడులో 152 రోజుల పాటు ఆడింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. రజనీకాంత్‌కు తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది.