In Kaala, Rajnikanth has never looked so good on screen with his stylised look and presentation, Patori body language, and dialogue delivery.
రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలూ.. ఫ్యాన్స్ ఫీవర్ పట్టుకోవడం చాలా సహజం. అడ్వాన్స్ బుకింగ్ ఎగబడటం, రిలీజ్ రోజున తలైవాపై అభిమానాన్ని చాటుకోవడానికి అభిమానులు హంగామా చేస్తుంటారు. ఆ రోజును పండుగల భావించే ఫ్యాన్స్ పనులన్నీ పక్కన పెట్టేసి ఆనందంలో మునిగిపోతారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఆరాట పడుతుంటారు. అందుకే కాలా చిత్రం రిలీజ్ నేపథ్యంలో కేరళలో ఓ ఐటీ కంపెనీ ఏకంగా జూన్ 7వ తేదీని హాలీడేగా ప్రకటించడం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఓవర్సీస్లో ప్రీమియర్ల నుంచి సోషల్ మీడియాలో ప్రేక్షకుల స్పందన వ్యక్తమవుతున్నది.
ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ మసాలా ఫిల్మ్. అద్భుతమైన సందేశంతో రూపొందిన మాస్ ఎంటర్టైనర్. రజనీకాంత్ పెర్ఫార్మెన్స్ టాప్ క్లాస్. కాలా చూడాలంటే ప్రధాన కారణం రజనీ. పా రంజిత్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్. క్లైమాక్స్ సీన్ మైండ్ బ్లోయింగ్.
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎంట్రీ సీన్ అదిరింది. వర్షంలో ఫైట్ బాగున్నది. పా రంజిత్ కథ, కథనాలు ఎక్స్ట్రార్టనరీగా ఉన్నాయి. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ సూపర్ ఫస్టాఫ్ పక్కా మాస్‌గా ఉంది.
ఇప్పటి వరకు నేను చూసిన రజనీ బెస్ట్ ఎంట్రీ ఇదే
చెన్నైలో 4 గంటలకే ప్రత్యేక షోలు ప్రారంభమవుతున్నాయి. కాలా సినిమా చూస్తుంటే న్యూజిలాండ్‌లో టెస్ట్ క్రికెట్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.