అలనాటి అందాల తార శ్రీదేవి, బోని కపూర్‌ల కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న 'ధడక్' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సోమవారం ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ తనను తాను నియంత్రించుకోలేక, తల్లిని తలుచుకుని కన్నీటి పర్యంతమయింది. భావోద్వేగానికి గురైన చెల్లిని జాహ్నవి కపూర్ దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ట్రైలర్ లాంచ్ వేడుకలో ఈ సంఘటన చూసిన వారి కళ్లు చెమ‍్మగిల్లాయి.
Comments