Skip to playerSkip to main content
  • 8 years ago
నేచురల్‌ స్టార్ నాని, ఇతర తెలుగు హీరోలపై చవకబారు ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి వ్యవహారంపై తమిళ నటుడు విశాల్ స్పందించారు. ఇప్పుడు నాని పేరు శ్రీరెడ్డి చెప్పారు. ఇలాగే నోరు మూసుకొని కూర్చొంటే ఇంకా ఎవరిపైనైనా బురద జల్లడానికి వెనుకాడరు అని ఆయన తీవ్రంగా స్పందించారు. శారీరకంగా వాడుకొని మోసం చేశారని ఇటీవల సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి వివాదంపై విశాల్ స్పందించారు.
శ్రీరెడ్డి ఆరోపణల నేపథ్యంలో నానికి విశాల్ మద్దతుగా నిలిచారు. నాని గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆయన నాకు మంచి స్నేహితుడు. వ్యక్తిగతంగా ఉండే రిలేషన్స్ కారణంగా ఆయనకు సపోర్ట్ చేయడం లేదు. నానిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం. మహిళల పట్ల నాని ఎలా వ్యవహరిస్తారనేది అందరికీ తెలుసు అని విశాల్ అన్నారు.
ఒకరిపై ఆరోపణలు చేస్తున్నామంటే వాటికి ఆధారాలు ఉండాలి. అవాస్తవాలతో ఎవరిపైనైనా బురద జల్లవచ్చు. ఆమె నోటి నుంచి ఎవరి పేరు బయటకు వస్తుందో తెలియని పరిస్థితి, ఆందోళన వ్యక్తమవుతున్నది. లైంగిక నేరాలకు సంబంధించిన చట్టాలలో కొన్ని అసమానతలు ఉన్నాయి.
ప్రస్తుత చట్టాల ప్రకారం ఏ మహిళైనా ఎవరిపైనైనా ఆరోపణలు చేయవచ్చు. వాటి ఆధారంగా చట్టాలు పనిచేసుకొంటూ పోతాయి. పురుషులకు తమను తాము కాపాడుకోవడానికి, తమ అభిప్రాయాన్ని వెల్లడించడానికి కూడా అవకాశాలు లేవు. అది సరికాదు అని విశాల్ అభిప్రాయపడ్డారు.

Recommended