Skip to playerSkip to main content
  • 8 years ago
Sanju has been performing extremely well at the box office, and the film crossed Rs 120 crore mark in just three days, beating Salman Khan's Race 3.
రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'సంజు' మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ బయోపిక్ 3 రోజుల్లోనే రూ 120 కోట్ల మార్కును అధిగమించడంతో పాటు సల్మాన్ ఖాన్ రేస్-3ని బీట్ చేసింది.
సంజయ్ దత్ జీవితంగా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలు ఉండటంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఇండియన్ బాక్సాఫీసువద్ద తొలి రోజు రూ. 34.75 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ... పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజైన శనివారం

మరింత పుంజుకుని రూ. 38.60 కోట్లు వసూలు చేసింది. ఆదివారం వసూళ్లు రూ. 46.71 కోట్ల రావడంతో టోటల్ కలెక్షన్ రూ. 120 కోట్లను అందుకుంది.
2018లో భారీ ఓపెనింగ్స్ సాధించిన బాలీవుడ్ సినిమాల లిస్టును తరణ్ ఆదర్శ్ ప్రకటించారు. ఇందులో రూ. 120 కోట్లతో ‘సంజు' మొదటి స్థానంలో ఉంది.
సల్మాన్ ఖాన్ ‘రేస్-3' విడుదలైన తొలి 3 రోజుల్లోనే రూ. 106 కోట్లు రాబట్టింది. ‘సంజు' చిత్రానికి ఆదివారం కలెక్షన్లతో కలిపితే మొత్తం రూ. 120 కోట్లు వసూలైంది. రేస్-3 మూవీ యావరేజ్ టాక్‌తో తొలివారమే డీలా పడగా.... ‘సంజు' చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. ‘సంజు' ఫుల్ రన్‌లో రేస్-3 పాటు పలు బాలీవుడ్ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Recommended