SaiDharamTej's Tej I Love You movie twitter review. Movie is not upto the mark of Karunakaran
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పై మెగా అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మేనమామల పోలికలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తేజ్ ఆరంభంలోనే అదరగొట్టాడు. రేయ్ చిత్రం నిరాశ పరిచినా.. పిల్లా నువ్వులేనిజీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం వంటి చిత్రాలతో తేజు అదరగొట్టాడు. తేజ్ లో ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఉండడంతో మెగా అభిమానుల్లో ఈ హీరోపై అంచనాలు పెరిగాయి. కానీ అందుకు తగ్గ కథలని ఎంచుకోవడంతో తేజు ప్రస్తుతం విఫలం చెందుతున్నాడు. వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. ఈ
నేపథ్యంలో కరుణాకరన్ దర్శకత్వంలో నటించిన క్లీన్ లవ్ స్టోరీ తేజ్ ఐ లవ్ యూ చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. తేజు పరాజయాలకు అడ్డుకట్ట పడిందా లేదా.. ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి.. ఇప్పుడు చూద్దాం..