నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సమంత సినిమాల్లో కంటిన్యూ అవ్వడంపై అప్పట్లో చాలా మందిలో అనేక సందేహాలు ఏర్పడ్డాయి. పెళ్లైన హీరోయిన్లకు సినిమాలు వర్కౌట్ అవుతాయా? మ్యారీడ్ బ్యూటీలను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా? అనే విమర్శలను పటాపంచలు చేస్తూ..... రంగస్థలం, మహానటి, తమిళంలో విశాల్‌తో 'ఇరుంబు తిరై' చిత్రాలతో వరుస విజయాలు అందుకుని హ్యాట్రిక్ నమోదు చేసింది ఈ చెన్నై బ్యూటీ. అయితే త్వరలో సమంత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
2017లో చైతన్యను పెళ్లాడిన సమంత... పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో సమంత సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందంటూ తాజాగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
సమంత ప్రస్తుతం తన చేతిలో ఉన్న సీమరాజా, సూపర్ డిలక్స్, యూ టర్న్ ప్రాజెక్టులను మార్చి 2019లోగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉందని, ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటోందని టాక్.
According to latest reports, Samantha has now decided to quit films in 2019. She is rushing to complete her films before March 2019. The Mersal actress has completed Seema Raja, Super Deluxe and Tamil-Telugu bilingual U-Turn as well.