Director Nabi Yenugubala's Masakkali is set to release on September 13th. Director Said that This is a pure love story. Story touches every hurt with pain. Sai Ronak, Shravya Vanka are lead.
#Masakkali
#NabiYenugubala
#SaiRonak
#ShravyaVanka
#tollywood
సమాజాన్ని తన కోణంలో చూసే అమ్మాయి కథగా వస్తోన్న సినిమా మసక్కలి. ఒక అమ్మ కోణంలో అర్జున్ రెడ్డి సినిమాను చూస్తే ఎలా ఉంటుందో మా సినిమా అలా ఉంటుంది. మసక్కలి అంటే స్వచ్ఛమైనది అని అర్థం. ఒక అమ్మాయిని, సమాజాన్ని అంత స్వచ్ఛంగా ప్రేమించిన అబ్బాయి ఆ అమ్మాయిల మధ్య సాగే కథ ఇది. ఈ 13 న విడుదల కానున్నది. మసక్కలి దర్శకుడు నబి యేనుగుబాల మాట్లాడుతూ.. అంతర్లీనంగా సందేశం ఉన్నా.. ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉన్నాయి. మంచి కామెడీతో పాటు రొమాన్స్ కూడా ఉంటుంది. కానీ ఏదీ కథను దాటి వెళ్లదు. అబ్బాయి మాత్రమే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అమ్మాయి అతన్ని ప్రేమించదు. ఆ కుర్రాడు సైకాలజీ స్టూడెంట్ గా ఓ డాక్టర్ వద్ద అసిస్టెంట్ గా ఉంటాడు. ఆ డాక్టర్ ఇచ్చిన ఓ కేస్ ను ఛేదించే క్రమంలో అతనికి ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది. ఈ అమ్మాయి ద్వారా తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేది కథ.