Veede Sarrainodu is a dubbed version of Tamil movie Thirunaal and it is a romantic action entertainer movie directed by Ramnath P. The movie cast includes Jeeva and Nayantara are in the lead roles while Srikanth Deva scored music.
#veedesarsinodu
#Nayanatara
#Jeeva
#Jakkulanageswararao
జీవా, నయనతార జంటగా తమిళంలో రూపొంది విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో 'వీడే సరైనోడు' పేరుతో అనువదిస్తున్నారు. నోవా సినిమాస్ పతాకంపై కోకా శిరీష సమర్పణలో జక్కుల నాగేశ్వరావు అందిస్తున్న ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సమర్పకులు జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ 'కంటెంట్ బాగుంటే సినిమా తప్పకుండా ఆడుతుంది. గతంలో నేను చేసిన 'లవ్ జర్నీ' సినిమాను ఆదరించారు. ఈ సినిమా కూడా అదే తరహాలో సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. ఈ సినిమాలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి నటులు ఉన్నారు. క్లైమాక్స్ ఈ సినిమాకు ఆదనవు ఆకర్షణ కానుంది. మా సినిమా విడుదలకు సహకరించిన నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ సహకరించారు. సుమారు 200 థియేటర్లలో విడుదల కానుంది. నయనతార, జీవ నటన సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది' అని తెలిపారు.