Skip to playerSkip to main content
  • 3 months ago
Bandi Sanjay Auto Ride : కేంద్రమంత్రి బండి సంజయ్​ ఆటోలో ప్రయాణించారు. కరీంనగర్ జిల్లా రేకొండలో ఆటోలో ప్రయాణించారు. డ్రైవర్​ దిలీప్​తో మోదీ 12 ఏళ్ల పాలన విజయాలపై ఆరా తీశారు. మోదీ విజయాలకు సంబంధించిన పుస్తకాలను అందించారు. ఆటోలో కొత్తపల్లి వైపు ప్రయాణించారు. మోదీ పాలనను ప్రజలు ఏమనుకుంటున్నారని ప్రతి ఒక్కరినీ అడిగి తెలుసుకున్నారు. మోదీ పాలనలో ప్రజలకు ఇష్టమైన కార్యక్రమాలేమిటని ఆరా తీశారు.అంతకు ముందు ఆయన జిల్లాలోని చిగురుమామిడి మండలం రేకొండ జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల గదులను శుభ్రం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. అనంతరం గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్థల సభ్యులతో కలిసి టిఫిన్ బైఠక్​లో పాల్గొని రేకొండ పాఠశాల శుభ్రత గురించి చర్చించారు. స్కూల్ అభివృద్ధికి ఏమోం కావాలో టీచర్లు, తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. 

Category

🗞
News
Transcript
00:00What
00:37Let's go.
Comments

Recommended