Skip to playerSkip to main content
  • 2 days ago
Bandi Sanjay At Laldarwaja Bonalu : ఆషాఢమాసం పురష్కరించుకొని హైదరాబాద్​లోని పాతబస్తీలో లాల్​దర్వాజా బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. బోనాల ఉత్సవాల సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్​ లాల్​దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజరులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. బండి సంజయ్​ అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం కేంద్రమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాజకీయం కంటే సనాతన ధర్మమే ముఖ్యమని,  తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం సంఘటితం చేయడం ముఖ్యమని పేర్కొన్నారు. కాగా సింహవాహిని అమ్మవారికి ఉదయం నుంచే ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి బోనం సమర్పించారు. ఇప్పటికే అమ్మవారిని మంత్రి సీతక్క, ఎంపీ అనిల్​ యాదవ్​, బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్​ దర్శించుకున్నారు. అలాగే టాలీవుడ్​ హీరోలు విజయ్​దేవరకొండ, ఆనంద్​ దేవరకొండతో పాటు దర్శకుడు సందీప్​రెడ్డి వంగతో పాటు పలువురు సింగర్లు అమ్మవారిని దర్శించుకున్నారు. 

Category

🗞
News
Transcript
00:26Thank you for listening.
Comments

Recommended