Skip to playerSkip to main content
  • 1 week ago
Bonalu Celebrations 2026 At Assembly : శాసనసభ ఆవరణలోని బంగారు మైసమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాల పండుగ ఘనంగా జరిగింది. అసెంబ్లీ ఉద్యోగుల ఆద్వర్యంలో నిర్వహించిన ఈ బోనాల ఉత్సవాలలో శాసనమండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్​కుమార్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్​ బండా ప్రకాష్, శాసనసభ్యులు పాల్గొన్నారు. ముందుగా ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా బోనాలను సమర్పించగా, పోతరాజుల విన్యాసాలు, డప్పుల వాయిద్యాలు, వివిధ వేషధారణలతో కళాకారుల ప్రదర్శనలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో ఉత్సావాలల్లో పాల్గొన్న ఉద్యోగులు, అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు. బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన పూజాకార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖులకు ఆలయ పూజారులు తీర్ధప్రసాదాలను అందజేశారు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా, సుఖశాంతులతో జీవించాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని శాసనమండలి ఛైర్మన్​, అసెంబ్లీ స్పీకర్​లు ఆకాంక్షించారు. 

Category

🗞
News
Transcript
00:02Oh
Comments

Recommended