Skip to playerSkip to main content
  • 2 months ago
Srisailam Varuna Yagam, Sahasra Ghatabhishekam Rain Ritual: రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని శ్రీశైల దేవస్థానం యంత్రాంగం వరుణ యాగ సహిత సహస్ర ఘట్టాభిషేకానికి శ్రీకారం చుట్టింది. దేవస్థానం ఆధ్వర్యంలో నిన్నటి (శుక్రవారం) నుంచి వరుణ జపాలు, పారాయణాలు చేపట్టారు. ఇది 5 రోజులపాటు చేయనున్నట్లు వేద పండితులు వివరించారు. ఈ క్రతువులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి తొట్టిలో వేద పండితులు కూర్చొని సాంప్రదాయ పద్ధతిలో జపాలు, పారాయణాలు చేశారు.ఋష్యశృంగ జపం, వరుణ పారాయణలు, వరుణ జపం, విరాట పర్వ పారాయణులు, పంచాక్షరీ మంత్రాలతో వరుణ దేవుని ప్రార్థించారు. మరోవైపు ఈ నెల 10వ తేదీన శ్రీశైల మల్లికార్జున స్వామికి అత్యంత వైభవంగా సహస్ర ఘటాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరో 3 రోజుల వరకు ఈ  యాగం కొనసాగనున్నట్లు వేద పండితులు తెలుపుతున్నారు. రాష్ట్రంలో వర్షాలు బాగా కురిసి పంటలు సంమృద్ధిగా పండాలని వరుణ యాగం చేస్తున్నట్లు పండితులు పేర్కొన్నారు.

Category

🗞
News
Transcript
00:00Thank you for listening.

Recommended