IT Minister Manthani Centralized Kitchen Launch : పెద్దపల్లి జిల్లా మంథనిలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ఇవాళ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ కిచెన్‌లో గంటకు 5,400 ఇడ్లీలు తయారు చేసే ఆటోమేటెడ్ స్టీమర్లు.. 2,000 దోశలు వేసే యంత్రం.. 3,000 పూరీలు తయారు చేయవచ్చు. దీని ద్వారా పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల 19 మండలాల్లోని 694 ప్రభుత్వ పాఠశాలలు, 17 జూనియర్ కళాశాలల్లోని 40 వేల మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వంతో సంయుక్తంగా పౌష్టికాహారం అందించేందుకు ఇస్కాన్, హరేరామ హరే కృష్ణ ట్రస్టులు ఈ కిచెన్‌ను ఏర్పాటు చేశాయి. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని, చదువుపై దృష్టి పెట్టి తమ మేధాశక్తిని పెంపొందించుకోవాలని అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి సూచించారు. మొదట కొడంగల్‌లో ప్రారంభమైన ఈ ఉచిత అల్పాహారం కార్యక్రమం ఇవాళ మంథనిలో ప్రారంభించామని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.
Comments