Chandrababu Launch Project Phase 1 : మార్కాపురం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ‘వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు’ పేరుతో కూటమి ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. కృష్ణమ్మకు చంద్రబాబు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.ఈ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంతంతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరవు ప్రభావిత ప్రాంతాలకు కొత్త జీవం రానుంది. తొలి దశ ప్రారంభం ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు విడుదల చేశారు. మొదటి విడతలో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల జనాభాకు తాగునీరు అందించనున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలించి నల్లమలసాగర్‌లో నిల్వచేసి ప్రధాన కాలువల ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది
Comments