Skip to playerSkip to main content
  • 43 minutes ago
Narasannapeta Bus Fire Accident : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సులో మంటలు చేలరేగాయి. బస్సు విజయవాడ నుంచి పలాస వైపు వెళ్తుండగా జమ్మూ కూడలి వద్దకు రాగానే టైర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు అందులోంచి కిందకు దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. దీనిపై సమాచారం అందుకున్న నరసన్నపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.మరోవైపు ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్​ నిలిచిపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు. శ్రీకాకుళంలో బస్సు ఆగిపోయిందని ప్రయాణికులు తెలిపారు. అప్పుడే దిగిపోమని చెప్పినా దిగేవాళ్లమన్నారు. క్లీనర్ వద్దని చెప్పినా డ్రైవర్ వినకుండా బస్సును నడిపించాడని వివరించారు. అయితే మంటలు చెలరేగిన విషయాన్ని డ్రైవర్‌ తమకు చెప్పి అప్రమత్తం చేయలేదని పేర్కొన్నారు. టైర్ పేలిన శబ్దం రాగానే తామే గమనించి కిందకు దిగిపోయామని వెల్లడించారు.

Category

🗞
News
Transcript
00:28Transcription by CastingWords
00:58Transcription by CastingWords
01:28Transcription by CastingWords
01:33Transcription by CastingWords
01:48Transcription by CastingWords
02:01Transcription by CastingWords
02:14Transcription by CastingWords
02:23Transcription by CastingWords
Comments

Recommended