Skip to playerSkip to main content
  • 5 weeks ago
Palangi Temple Decorated With Currency Notes : శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి భక్తులు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఉండ్రాజవరం మండలం పాలంగిలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వివిధ రకాల కరెన్సీ నోట్లతో అమ్మవారిని, గర్భగుడిని అలంకరించారు. కరెన్సీ నోట్ల తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ధనలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వరలక్ష్మీ వ్రతం రోజు శుక్రవారం అమ్మవారిని దర్శించుకుంటే సర్వ శుభాలు జరుగుతాయని, సుమంగళిగా ఆశీర్వదిస్తుందని భక్తుల విశ్వసిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

Category

🗞
News
Transcript
00:00Thank you very much.
Comments

Recommended