Skip to playerSkip to main content
  • 2 days ago
Venkateswara Swamy Pulse Art : దేవునిపై ఉన్న భక్తిని చాటుకోవడానికి భక్తులు రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కొందరు మహిళలు తమ భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. అంబాజీపేటలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ పప్పు దినుసులతో తీర్చిదిద్దిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చిత్రాలు చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీవారి రూపాన్ని ఆవిష్కరించేందుకు మహిళలు రంగులు, కుంచెను వినియోగించలేదు. వంటగదిలో ప్రతిరోజూ ఉపయోగించే నిత్యావసరాలనే వారు వర్ణచిత్రాలుగా మార్చేశారు. ముందుగా ఒక తెల్ల కాగితంపై వెంకటేశ్వర స్వామి వారి రూపాన్ని అందంగా చిత్రీకరించారు. ఆ తర్వాత ఆ రేఖాచిత్రంపై ఎంతో ఓర్పుగా వివిధ రకాల పప్పు దినుసులను పేర్చారు.ఈ చిత్రాల తయారీకి కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు తదితర సాధారణ పప్పులను ఉపయోగించారు. ఇక స్వామివారి ఆభరణాలు, కిరీటం, ఇతర అలంకరణల కోసం జీడిపప్పు, రకరకాల మసాలా దినుసులను ఎంతో నేర్పుగా అమర్చారు. పసుపు పచ్చని పెసరపప్పు, తెలుపు రంగు మినప్పప్పు కలయికలతో చిత్రాలకు ప్రాణం పోశారు. ఎంతో సూక్ష్మంగా, భక్తిశ్రద్ధలతో మహిళలు తీర్చిదిద్దిన ఈ చిత్రాలు ఆలయానికి వచ్చే భక్తులందరినీ ఆకర్షిస్తున్నాయి. 

Category

🗞
News

Recommended