Skip to playerSkip to main content
  • 11 minutes ago
Pedda Bathukamma Celebrations : పూలను దేవతలుగా భావించి పూజించే పవిత్రత. ప్రకృతిని తల్లిగా ఆరాధించే గొప్పతనం. ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని చాటిచెప్పే సంస్కారం. తరతరాల చరిత్రను నిక్షిప్తం చేసుకున్న సంప్రదాయం. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా, సంప్రదాయాల కలబోతగా అపురూపమైన సాంస్కృతిక వేడుకగా ఆడబిడ్డలు జరుపుకునే బతుకమ్మ సంబురాలు తుది దశకు చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఊరూవాడా, చిన్నాపెద్దా అంతా కలిసి బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఈ పూల పండుగ సంబురం నేటి సద్దుల బతుకమ్మ వేడుకలతో అత్యంత వైభవంగా ముగియనుంది. ఈ రోజున ఐదు రకాల సద్దులతో బతుకమ్మకు నైవేద్యం సమర్పిస్తారు. ఎప్పటిలాగే ఈసారి కూడా బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు తెలంగాణ ఆడబిడ్డలు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా పెద్ద బతుకమ్మ సందడి నెలకొంది. మార్కెట్లలో వ్యాపారులు రంగురంగుల, తీరొక్క పుష్పాలను అమ్మడానికి తీసుకురాగా, మహిళలు వాటిని కొనుగోలు చేస్తుండటంతో బజార్లలో కోలాహలం నెలకొంది.

Category

🗞
News
Transcript
00:00Let's get started.
00:44Let's get started.
01:00Let's get started.
01:32Let's get started.
01:34Let's get started.

Recommended