Skip to playerSkip to main content
  • 7 minutes ago
Minister Seethakka Attends Bathukamma Celebrations : ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరుకాగా, కమిషనర్ దివ్య దేవరాజన్ పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో మహిళా సిబ్బంది పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అధికారులతో కలిసి మంత్రి సీతక్క బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలు, సందడి నడుమ కార్యాలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా మహిళలు మంత్రి సీతక్కకు ఆప్యాయంగా బొట్టు పెట్టి, నూతన వస్త్రాలను అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళా సిబ్బంది ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. మంత్రి సీతక్క అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలను తెలిపారు.  ఈ కార్యక్రమంలో కమిషనర్ దివ్యరాజన్​తో పాటు పంచాయతీరాజ్​ కమిషనర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. 

Category

🗞
News

Recommended