Skip to playerSkip to main content
  • 7 minutes ago
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాస వేడుకలు అంబరాన్నంటాయి. పవిత్రమైన కార్తీక సోమవారం పురస్కరించుకొని ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అత్యంత వైభవంగా అంబారీ వాహన సేవ చేపట్టారు. ఆదిదంపతుల దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి ఉత్సవమూర్తులకు వేదపండితులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి అంబారీలపై కొలువుదీర్చారు. మేళతాళాల నడుమ ఆలయ నాలుగు మాడవీధుల్లో ఉత్సవమూర్తులను కన్నులపండువగా ఊరేగించారు.ఈ కనులవిందును తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాడవీధుల్లో ఊరేగుతున్న ఆదిదంపతులకు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల 'ఓం నమశ్శివాయ' నామస్మరణలతో శ్రీకాళహస్తి పురవీధులు మారుమ్రోగాయి. మరోవైపు ఆలయ పరిధిలోని వైష్ణవ కోనేరు వద్ద భక్తులు సామూహిక కార్తీక దీపోత్సవం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో వెలిగించిన దీపాల కాంతుల్లో కోనేరు పరిసరాలు దేదీప్యమానంగా ప్రకాశించాయి.

Category

🗞
News
Transcript
00:00Thank you for joining us.

Recommended